దేశ వ్యాప్తంగా దసరా సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. లక్నోలోని రాంలీలా మైదానంలో జరుగుతున్న దసరా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంధర్బంగా మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదం మానవత్వానికి శత్రువు అని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మొదట పోరాడింది జటాయువు అని గుర్తు చేశారు. మహిళల గౌరవం కాపాడేందుకు జటాయువు పోరాడాడని తెలిపారు. మానవతావాదులంతా ఏకమై ఉగ్రవాదంపై పోరాడాలి అని పిలుపునిచ్చారు. 1992-93లో ఉగ్రవాదం శాంతిభద్రతల సమస్యగా అమెరికా చెప్పేదని గుర్తు చేశారు. 9/11 దాడి తర్వాత అమెరికా వైఖరిలో మార్పు వచ్చిందన్నారు. ఆధునిక కాలంలో ఉగ్రవాదం, అవినీతి, వ్యాధులు, అపరిశుభ్రత రావణ రూపాలే అని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు యుద్ధం అనివార్యం కావొచ్చన్నారు. మన మార్గం యుద్దం కాదు.. బుద్ధం అని వ్యాఖ్యానించారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదు.. ఆలోచనే దారి చూపుతుందన్నారు.