Pakisthan:ఉగ్రదాడి..13 మంది మృతి

44
- Advertisement -

బాంబుల మోతతో దద్దరిల్లింది పాకిస్ధాన్. కబాల్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 13 మంది మృతిచెందారు. స్వాత్‌ జిల్లాలోని ఉగ్రవాద నిరోధక విభాగం పోలీస్ స్టేషన్ లక్ష్యంగా ఉగ్రదాడి జరుగగా పది మంది పోలీసులతో సహా 13 మంది మరణించారు. సుమారు 50 మందికిపైగా గాయపడ్డారు.

దాడికి పాల్పడ్డ ఉగ్రవాది కూడా తనను తాను పేల్చేసుకున్నట్లు సమాచారం. ఉగ్రదాడి తరువాత స్వాత్ జిల్లా పరిధిలో హైఅలర్ట్ ప్రకటించగా పేలుళ్లతో భయానక వాతావరణం నెలకొంది. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు.

Also Read:బరువు పెరగాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే !

ఉగ్రదాడి ఘటనను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన… క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Also Read:CMKCR:దేశం పురోగమిస్తుందా.. తిరోగమిస్తుందా..?

- Advertisement -