నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేశారు టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి. నల్గొండ రిటర్నింగ్ ఆఫీసర్‌కు మంత్రి జగదీష్ రెడ్డి,ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
2015లో ఇదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు చిన్నపరెడ్డి. రెండోసారి ఇదే నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్న ఆయన గెలుపు లాంఛనమే కానుంది. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,కౌన్సిలర్లు మెజార్టీగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
రేపు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో మిగిలిన టీఆర్ఎస్ అభ్యర్థులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కూడా నామినేషన్లు వేయనున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. వరంగల్ నుండి ఇనుగాల వెంకట్రామిరెడ్డి,నల్గొండ నుండి కోమటిరెడ్డి లక్ష్మీ,రంగారెడ్డి నుండి ఉదయ మోహన్ రెడ్డి పేర్లను ప్రకటించింది.