BJP:ఆ ముగ్గురు బీజేపీ నేతల్లో టెన్షన్?

39
- Advertisement -

జూన్ 4..సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కోసం నేతలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఏ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుంది అన్న దానిపై అందరిలో టెన్షన్ నెలకొంది. ఎవరికి వారే తమకు డబుల్ డిజిట్ సీట్లంటే తమకే నంటూ చెబుతున్నారు.

అయితే ఆ ముగ్గురు బీజేపీ నేతల్లో మాత్రం రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతుందట. సికింద్రాబాద్ నుండి మరోసారి బరిలోకి దిగారు కిషన్ రెడ్డి. అయితే ఆయనపై వ్యతిరేకత ఉండటం, బీఆర్ఎస్ నుండి పద్మా రావు వంటి బలమైన నేత బరిలో దిగడంతో గెలుపు ఎవరిని వరిస్తుందా అని జోరుగా చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకుంటుందని ప్రచారం జరుగుతోండగా కిషన్ రెడ్డి మాత్రం తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్‌ది ఇదే పరిస్థితి. ఎంపీగా కరీంనగర్‌కు ఏం చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ టఫ్ ఫైట్ ఇవ్వగా ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బండి సంజయ్‌ని ఓడించేందుకు బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకువచ్చింది. నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్ పోటీలో ఉండగా కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి,బీఆర్ఎస్ నుండి బాజిరెడ్డి బరిలో ఉన్నారు. ప్రధానంగా అరవింద్‌పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉండగా ఈ ముగ్గురు నేతలు మోడీ ఫ్యాక్టర్‌ పై ప్రజల్లో ఉన్న సానుకూలతే తమను గట్టెక్కిస్తుందని పైకి చెబుతున్న లోలోపల మాత్రం తీవ్ర అంతర్మథనంలో ఉన్నారట. మరి ఈ ముగ్గురు నేతల్లో గెలుపు ఎవరిని వరిస్తుందోనని కమలనాథులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Also Read:Harish:అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే

- Advertisement -