- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ప్రజాప్రతినిధులు నినాదాలు చేస్తున్నారు.
కేటీఆర్, హరీశ్ రావు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదానీ, రేవంత్ రెడ్డి ఫొటోతో కూడిన టీ షార్ట్స్ ధరించడం పట్ల భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు.అదానీ, రేవంత్ దోస్తానాపై నిరసన తెలుపుతున్నారు. రేవంత్ అదానీ భాయి భాయి అంటూ నినాదాలు చేస్తున్నారు.
ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ, తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్ తల్లి నీది, బతుకమ్మను తీసి చేయి గుర్తు పెట్టిందంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించారు.
Also Read:మహా కుంభమేళకు 13 వేల రైళ్లు
- Advertisement -