TTD:న‌వంబ‌రు 7న మిక్సిడ్‌ రైస్‌ టెండర్‌ వేలం

3
- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను న‌వంబ‌రు 7వ తేదీన టెండర్‌ మరియు వేలం వేయనున్నారు. ఇందులో మిక్సిడ్‌ బియ్యం 13,880 కేజిలు టెండర్‌ మరియు వేలంలో ఉంచనున్నారు.

ఆసక్తి గలవారు నవంబరు 7వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టీటీడీ” పేరిట రూ. 25,000/- ఈఎండి, సీల్డ్‌ టెండర్‌తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం, జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లను తెరవడం జరుగుతుంది.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించగలరు.

Also Read:KTR:ఆగిన విద్యుత్ ఛార్జీల పెంపు..బీఆర్ఎస్ విజయం

- Advertisement -