యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న చిత్రం `తెనాలి రామకృష్ణ బి.ఎ బి.ఎల్`. `కేసులు ఇవ్వండి ప్లీజ్` ట్యాగ్ లైన్. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సందీప్‌కిషన్ పుట్టినరోజు(మే 7) సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో సందీప్ కిషన్ లాయర్ పాత్రలో కనపడుతున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో మంచి పేరున్న దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని కూడా తనదైన స్టైల్లో లాఫింగ్ రైడర్‌గా రూపొందిస్తున్నారు. హన్సిక, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
నేటి నుండి రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్లో ఎంటైర్ యూనిట్ పాల్గొంటుంది. సాయికార్తీక్ సంగీతం, సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.