శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు..కవిత ప్రత్యేకపూజలు

304
Temple decks up for Karthika Pournami fete
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నదీ స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో బారులుతీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి, కృష్ణా నదీ తీరాల్లో కొలువుతీరిన ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివ నామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి.

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ర్టంలోని ప్రముఖ దేవాలయాలు యాదాద్రి, వేములవాడ, భద్రాచలం, బాసర, చెర్వుగట్టు రామలింగేశ్వరాలయం వంటి తదితర ఆలయాలకు భక్తజనం బారులు తీరారు.

Temple decks up for Karthika Pournami fete

కీసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో… ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొంటున్నారు.మహబూబ్ నగర్ లో ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపోత్సవంతో ఆలయాలన్ని శోభాయమానంగా వెలిగిపోతున్నాయి.

Temple decks up for Karthika Pournami fete

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో స్నానమాచరించిన భక్తులు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి బారులుతీరారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట లాడుతోంది. మహిళా భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Temple decks up for Karthika Pournami fete

రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి పోటెత్తారు. పరమశివుడు అనుగ్రహం కోసం భక్తులు భక్తిశ్రద్దలతో కార్తీక స్నానాలు ఆచరించారు. కార్తీక సోమవారంతో పాటు పౌర్ణమి కావడంతో తెల్లవారుజాము నుంచే రద్దీ మొదలైంది. దీంతో గోదావరి ఘాట్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

- Advertisement -