- Advertisement -
జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మారుస్తూ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఇప్పటికే ఫ్లైఓవర్ కోసం ఆర్చ్ ను సిద్ధం చేస్తోంది జిహెచ్ఎంసి. రెండు వైపులా ఆర్చ్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం వద్ద తీవ్రమై ట్రాఫిక్ సమస్య ఉండేది. దీనిని నియంత్రించేందుకు 1997 లో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సచివాలయం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు నిర్మించిన ఈ బ్రిడ్జ్‌ని 2005లో ప్రారంభించారు. దీనికి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ అని నామకరణం చేశారు.
రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ను తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మార్చాలని నిర్ణయించారు.
Also Read:రెడ్‌బుక్‌కు పోటీగా డిజిటల్ బుక్!
- Advertisement -

