తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

7
- Advertisement -

తెలుగు రాష్ట్రాల వెదర్ అప్‌డేట్‌ను ఇచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు/ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, గాలి వానల కోసం అప్రమత్తంగా ఉండాలి అన్నారు.

రాష్ట్రంలో మేఘావృతం/ఆకాశం మబ్బుగా ఉండే పరిస్థితులు కొనసాగుతాయి. హైదరాబాద్ గరిష్ఠ ఉష్ణోగ్రత 30-31°C మధ్య ఉండే అవకాశం ఉందని… మేఘావృత వాతావరణం, తేలికపాటి జల్లులు/వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. సాయంత్రం/రాత్రి సమయంలో భారీ వర్షం కురిసే అవకాశముంది.

#ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేఘావృతం/మబ్బుగా ఉండే పరిస్థితులు కొనసాగుతాయి అన్నారు. ఉత్తర/మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో తీవ్రమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కొనసాగే అవకాశం ఉందని… #విశాఖపట్నం గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 30°C ఉండే అవకాశం, భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు.

Also Read:బెల్లంతో లాభాలు ఎన్నో!

- Advertisement -