తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

11
- Advertisement -

తెలుగు రాష్ట్రాల వెదర్ అప్‌డేట్‌ని ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. వాయు పీడన ప్రాంతం రేపటి వరకు దక్షిణ–అనుబంధ బంగాళాఖాతంలో ఏర్పడవచ్చు అని అధికారులు తెలిపారు.

ఇది వచ్చే 3 రోజులలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల వైపు ప్రయాణించవచ్చు అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు 27 జూలై వరకు చురుకుగా కొనసాగే అవకాశం ఉందని చెప్పారు.

రాయలసీమ, దక్షిణ/మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల్లో విస్తృతంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని… కొన్ని చోట్ల భారీ/తీవ్రమైన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణలో కూడా విస్తృత వర్షాలు కురిసే అవకాశముందని.. ముఖ్యంగా మధ్య/తూర్పు తెలంగాణ జిల్లాల్లో వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read:మొక్కలను నాటాలని ప్రతిజ్ఞ చేద్దాం:సంతోష్ కుమార్

- Advertisement -