తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

4
- Advertisement -

రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్టును వెల్లడించింది వాతావరణ శాఖ. దక్షిణ-తూర్పు గాలుల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°C కంటే తక్కువగా ఉండే అవకాశముందని తెలిపింది.

చాలా ప్రాంతాల్లో తేమ (Humidity) సాధారణ స్థాయికి పైగా ఉండవచ్చు అని..తూర్పు తెలంగాణలో పిడుగులతో కూడిన తుఫాన్లు (థండర్‌స్టార్మ్‌లు) సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా జయశంకర్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, జనగామ, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

దక్షిణ తెలంగాణలో కూడా మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో తుఫాను వర్షాలు వచ్చే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రత 35-36°C మధ్య ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. చాలా ప్రాంతాల్లో దిన ఉష్ణోగ్రతలు 40°C కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. విశాఖపట్నం గరిష్ట ఉష్ణోగ్రత 32-33°C మధ్య ఉండే అవకాశం ఉంది, తేమ మాదిరిగా ఉంటుందని తెలిపింది.

Also Read:ట్రంప్ మరో సంచలన నిర్ణయం

- Advertisement -