దాదాపు 80 రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరచుకున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన టీటీడీ, యాదాద్రిలో స్వామి వారి దర్శనాలకు నేటినుండి అనుమతించారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో నేడు ప్రయోగాత్మకంగా ఆలయ సిబ్బందికి మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. ఇక యాదాద్రిలో ముందుగా ఆలయ ఉద్యోగులు, స్దానిక ప్రజలకు స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తుండగా రేపటి నుండి ఇతర ప్రాంతాల భక్తులకు స్వామి వారిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఇక తిరుమలలో ఈ నెల 10న స్ధానికులకు శ్రీవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయగా 11 నుండి అందరు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది టీటీడీ.
ప్రతి ఆలయంలోనూ ఖచ్చితమైన నిబంధనలు పాటించేలా అంటే మాస్కు ఉంటేనే ఆలయంలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే క్యూ లైన్ల దగ్గరి నుండి అన్ని కౌంటర్‌లలో భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఆలయాలకు వచ్చే ప్రతి భక్తుడిని స్క్రీనింగ్ టెస్టు నిర్వహించిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తున్నారు.