థియేటర్లు బంద్..పవన్ సినిమాకు బ్రేక్!

9
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు కీలక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని నిర్మాతలకు తేల్చిచెప్పారు ఎగ్జిబిటర్లు. పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు.

ఓటీటీలతో తీవ్రంగా నష్టపోతున్నామని…అందుకే సినిమాలకు పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే థియేటర్ల మనుగడ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. జూన్ నెలలో పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లుతో పాటు పలు చిత్రాలు రిలీజ్‌కు ఉన్న నేపథ్యంలో నిర్మాతలు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

Also Read:కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా

- Advertisement -