చలి కుంపటి.. మంచు దుప్పటి

187
chali
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

రాబోయే మూడు రోజుల్లో 10 డిగ్రీల సెల్సియ‌స్ కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో వృద్ధులు, పిల్ల‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, వెచ్చ‌ని దుస్తులు ధ‌రించాల‌ని సూచించింది.ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల‌, మెద‌క్, నిర్మ‌ల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల‌కు వాతావ‌ర‌ణ విభాగం ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త‌లు సింగిల్ డిజిట్‌కే పరిమితమ‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు.

చలితీవ్రత అధికంగా ఉన్ ననేపథ్యంలో రాత్రిపూట జాగ్రత్తగా ఉండాలని 7 గంటలు దాటిన తర్వాత ప్రయాణాలు వాయిదా వేస్తే మందచిదని సూచించారు వైద్యులు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -