అరుంధతి నక్షత్రం వద్దు..పవనే కావాలి..!

221
Telugu star Pawan Kalyan
- Advertisement -

పెళ్ళి చేసుకున్నాక…సాంప్రదాయం ప్రకారం వధువరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపించడం సర్వసాధారణం. కానీ అప్పుడే పెళ్ళి చేసుకున్న వధువరులు మాత్రం ఆ సాంప్రదాయాన్ని చేంజ్‌ చేశారు. అరుంధతి నక్షత్రం బదులు వారికి నచ్చిన హీరో ఫొటోని చూశారు. ఆ హీరోనే వారికి అరుంధతి నక్షత్రం అంటూ వారి సరదాని తీర్చేసుకున్నారు. ఇంతకీ వారు దైవంలా భావించిన ఆ హీరో ఎవరో తెలుసా..? పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.

 Telugu star Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కు ఉన్న అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అభిమానులు ఆయన్ను కేవలం అభిమానించడంతోనే సరిపెట్టుకోరు. ఆరాధిస్తారు కూడా. అందుకు ఈ నూతన వధూవరులే నిదర్శనం. పెళ్లికూతురు-పెళ్లికొడుకు పవన్ ఫ్యాన్స్ కావడంతో వాళ్లు ఏం డిమాండ్ పెట్టారయ్యా అంటే…అరుంధతి నక్షత్రం తాము చూడమని ప్రకటించారు. అందుకు బదులుగా పవన్ కళ్యాణ్ ఫోటోను చూస్తామని తేల్చిచెప్పేశారు.

ఈ డిమాండ్తో పెళ్లికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు. ఆ దంపతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కుదరదంటే కుదరని చెప్తూ పవన్ బొమ్మనే చూస్తామని ఆ నూతన దంపతులు పట్టుబట్టడంతో….అప్పటికప్పడు పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఒకటి తెచ్చి అక్కడ పెట్టారు. ఇంకేం తమ అభిమాన నటుడి చిత్రాన్ని ఏర్పాటు చేయడంతో నూతన వధూవరులు ఖుష్. పవన్ ఫ్లెక్సీని సంతోషంగా దర్శనం చేసుకుని ఫోటోలకు పోజిచ్చి హద్దులు దాటిన తమ అభిమానాన్ని చాటుకున్నారు.

- Advertisement -