పాక్‌ చేరలో తెలుగు యువకుడు..

824
Telugu Man Arrested in Pakistan
- Advertisement -

పాకిస్థాన్‌లో అక్రమంగా ప్రవేశించారని ఇద్దరు భారతీయులను పాక్‌ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్ కాగా, మరొకరు విశాఖపట్టణానికి చెందిన ప్రశాంత్ వైందంగా గుర్తించారు. పాస్‌పోర్టు, వీసా లేకుండా వీరు తమ దేశంలోకి ప్రవేశించినట్టు పాక్ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 14న వీరిని బహావుల్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరిద్దరిపైన అక్కడి చట్టంలోని 334-4 కింద అభియోగాలు నమోదయ్యాయి.

పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల బహావల్పూర్‌లో అరెస్టయిన ఈ ఇద్దరిలో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని తెలుస్తున్నదని, పాక్‌లో ఉగ్రదాడి జరిపేందుకే అతడు వచ్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారని జియో న్యూస్ వార్తాసంస్థ వెల్లడించింది. వైజాగ్‌లోని మిథులాపురి హుడా కాలనీకి చెందిన ప్రశాంత్ తన కుటుంబసభ్యులతో కలిసి కొన్నేండ్లు హైదరాబాద్ కూకట్‌పల్లి ఫేజ్-1లోని భగత్‌సింగ్ నగర్‌లో ఉన్నాడు.

అయితే ప్రశాంత్ ప్రియురాలు స్విట్జర్లాండ్‌లో ఉంటున్నదని, ఆమెను కలుసుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి పాకిస్థాన్‌కు చేరుకొన్న ప్రశాంత్.. అక్కడి నుంచి యూరప్‌కు వెళ్లే ప్రయత్నంలో పాక్ పోలీసులకు పట్టుబడినట్టు తెలుస్తున్నది. కాగా గతంలో కూడా ఇలాంటి సంఘన చోటు చేసుకుంది. గత ఆగస్టులో రాజు లక్ష్మణ్ అనే భారత గూఢచారిని పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో అరెస్ట్ చేసినట్టు ఈ సందర్భంగా పేర్కొంది.

Prashant Vaindam, a software professional from Hyderabad, who went missing about two years ago, was arrested by Pakistan police..

- Advertisement -