తెలుగు విశ్వభాష కావాలి…

255
Telugu Language for All
- Advertisement -

తెలుగును విశ్వభాషగా చేయడానికి అందరూ కృషి చేయవలసిన అవసరం ఉందని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. తెలుగు విశ్వవిధ్యాలయమం లో నిర్వహించిన “తెలంగాణలో సాహితీ విమర్ష-పరిశోధన” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధుసుదనాచారి రాష్ట్ర రాజధానిలో 6 వేదికల్లో నిర్వహిస్తున్న విభిన్న కార్యక్రమాలు ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యం లో తెలుగు ప్రజలందరికి,తెలుగు భాషకు,కవులకు,సాహితీ వేత్తలకు పట్టం కట్టి తెలుగు భాష ,సాహిత్యం,చరిత్ర గురించి  ప్రపంచ ప్రజలకి తెలియజేయడం అభినందనీయమన్నారు.తెలంగాణలో లోతైన పరిశోధన ద్వారా ఇప్పటికి వెలుగులోకి వచ్చిన,వస్తున్న శాసనాలు తెలుపుతున్న ఆధారాలను బట్టి మనవద్దే ముందుగా గొప్ప సాహిత్య శోధన జరిగిందని తెలుస్తుందన్నారు.

Telugu Language for All
కంద పద్యం తెలుగులోనే మొదటగా వచ్చిందని విషయం మరింద పరిశోధన జరగాల్సి ఉందన్నారు. తెలుగు భాషలందు తెలుగు గొప్పే కాకుండ తెలుగు మాధుర్యం,తియ్యదనం అందరూ అంగీకరించేదేనన్నారు.అంతేకాక బతుకమ్మ లాంటి పండగ తెలంగాణకు,ప్రపంచానికి ఒక గొప్ప సమ్మేళనమని ఇది ఎక్కడా లేనిదని తెలిపారు.అంతేకాదు తెలుగు వారు  మంచికి సహాయపడతారని,దిక్కారాన్ని సహించరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిద్దారెడ్డితో పాటు పలువురు సాహిత్యకారులు పాల్గొన్నారు.

- Advertisement -