తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలపై కీలకనిర్ణయం

102
- Advertisement -

భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అత్యధిక సినిమాలు విడుదల చేస్తుంటారు. చిన్న చితక కలిపి సంవత్సరానికి సూమారుగా 2వేల సినిమాలు తీస్తుంటారు. కాగా తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి సినీ పెద్దలు నిర్మాతల మండలి, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లు ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఓటీటీలు, వీపీఎఫ్‌ ఛార్జీలు, టికెట్‌ ధరలు, నిర్మాణ వ్యయం ఇలా అనేక రకాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే తాజాగా సినీ పరిశ్రమలో చిన్న సినిమాలకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేశారు. రూ.4కోట్ల రూపాయలు బడ్జెట్‌గా ఉన్న దానిని చిన్న సినిమాగా పరిగణించనున్నట్లు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ప్రకటించింది.

చిన్న సినిమాలపై నిర్ణయాలు

  1. రూ.4కోట్ల బడ్జెట్‌గా ఉన్న దానిని చిన్న సినిమాగా గుర్తించడం.
  2. సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి 15రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.
  3. ఆ దరఖాస్తును ఫిలిం ఛాంబర్‌ ఫిలిం ఫెడరేషన్‌ ఉన్న సబ్‌ కమిటీ పరిశీలించి నిర్ధారణ చేస్తుంది. దానిని ఫెడరేషన్‌ ఆమోదించి 15శాతం వేతన రాయితీ ఇస్తుంది.
  4. చిన్న సినిమాగా ఆమోదించిన తర్వాత ఫెడరేషన్ వారు ఆ ప్రొడ్యూసర్‌కి కచ్చితంగా 15శాతం తగ్గించి వేతనాలు తీసుకోవాలి. దానిని ఫెడరేషన్‌ తీసుకొని 15శాతం వేతనాలు అమలుచేయాలి.
  5. కార్మికులు 15శాతం రాయితీని అములు చేయకపోతే దాని మీద ఏం చేయాలో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి.
  6. నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఇచ్చిన బడ్జెట్‌ వివరాలు ఎక్కువ కాకుండా వారిచ్చిన బడ్జెట్‌లోనే నిర్మాణం చేస్తామని సదరు సినిమా నిర్మాత, డైరెక్టర్‌ ఒక అఫిడవిట్‌ను ఫిలిం ఛాంబర్‌కు ఇవ్వాలి. ఒకవేళ ఆ బడ్జెట్‌ ఎక్కువైతే దానికి దర్శకుడు బాధ్యత వహించాలి.
  7. నెలలో 2, 4వ మంగళవారం నాడు కమిటీ ఛాంబర్‌లో ఫెడరేషన్‌ నుంచి ఇద్దరు ఛాంబర్‌ నుంచి ఇద్దరు కూర్చొని చిన్న సినిమాల బడ్జెట్‌ను పరిశీలించి ఆమోదం తెలిపి వారికి లెటర్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది.
  8. సినిమాకు సంబంధించిన బడ్జెట్‌ కమిటీకి తెలిపేందుకు ఛాంబర్ తయారు చేసిన ప్రొఫార్మాలో సదరు సినిమాకు పనిచేసే ముఖ్యమైన టెక్నీషియన్స్‌తో సంతకాలు చేయించి ఎన్ని రోజుల్లో మూవీ పూర్తి చేస్తారో తెలిపాలి. నటీనటులు సాంకేతిక బృందం పారితోషికాలు షూటింగ్‌ ఖర్చులు తెలపాలి.
  9. ఈ బడ్జెట్‌ను నిర్మాతతో పాటు డైరెక్టర్‌ మేనేజర్‌ కూర్చొని తయారు చేసి ఇవ్వాలి.
- Advertisement -