మాస్.. ఊర మాస్. ఈ డైలాగ్ సినిమాల్లో ని హీరోలకే కాదు..సినిమాలు తీసే డైరెక్టర్లకూ సెట్ అవుతుందనే చెప్పాలి. అయితే ఈ డైలాగ్ పూరీది కాకపోయినా..పూరీ మాత్రం ఈ డైలాగ్ కి భలే సెట్ అవుతాడు. ఎందుకంటే పూరీ …టూ..ఫ్రాంక్ కాబట్టి. తన సినిమాల్లో ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా చెప్పేయడం పూరీ స్టైల్.
పూరీ సినిమాలు, అందులోని డ్రెస్సింగ్ స్టైల్స్..ఎలా ఉంటాయో… బయట కూడా పూరీ డ్రెస్సింగ్ స్టైల్ అలాగే ఉంటుంది. అయితే ఎప్పుడూ స్పైసీ కాస్ట్యూమ్స్ మీద దృష్టి పెట్టే పూరీ.. ఆబ్కారీ భవన్లో క్వశ్చనింగ్ కోసం హాజరైన పూరీ పూర్తి వైట్ అండ్ వైట్ తో కొత్తగా కనిపించి తాను పక్కా ఫ్యామిలీ మాన్ అంటూ సిగ్నల్ ఇచ్చేశాడు.
పైగా.. విచారణకు వెళుతూ తన వెంట తమ్ముడు సాయిశంకర్, కొడుకు ఆకాష్ ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఓ వైపు చార్మీ కారణంగా తన కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడంటూ పూరీపై వస్తున్న వార్తలు గుప్పుమంటున్న క్రమంలో ..ఇప్పుడు తన వెంట ‘ఫ్యామిలీ’ ఉందంటూ చెప్పకనే చెప్పాడు.
ఇప్పటికే.. పూరి కూతురు పవిత్రా జగన్నాధ్ డ్రగ్ ఎపిసోడ్ మీద స్పందించింది. మా నాన్న చాలా మంచోడని, మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు లేదని ఆమె సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చేసింది. ఈ స్టేట్ మెంట్ కూడా పూరీ ప్రోద్బలంతోనే ఇచ్చినట్లు తెలుస్తోంది.
కట్ చేస్తే.. ఈ రోజు పూరీ విచారణకు వెళుతూ తన తమ్ముడిని, కొడుకుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఇదంతా చూస్తుంటే..తన మీద పడ్డ డ్రగ్ మరకను తుడిచేసుకోడానికి సరికొత్త కుటుంబ కథా చిత్రానికి పూరీ ప్లాన్ చేశాడా? అనే డౌట్స్ మొదలవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. పూరీ పై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలపై ఇప్పటివరకు పూరీ భార్య లావణ్య జగన్నాథ్ మాట్లాడకపోవడం అటుంచితే.. విచారణకు వెళుతున్న పూరీ వెంట ఆయన భార్య రాకపోవడంపై పలు అనుమానాలు మొదలవుతున్నాయి. ఏదేమైనా స్టైల్ తగ్గించిన పూరీ..తన ఇమేజ్ డామేజ్ అవుతోందన్న సంకేతాల నేపథ్యంలో.. పూరీ ఈ విధంగా ‘ఫ్యామిలీ సెంటిమెంట్’ ని తెర పైకి తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది.