- Advertisement -
ఇప్పటి వరకు ఏ దేశము అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్నిఛేదించి చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువ ఉపరితలంపై అడుగుపెట్టడం భారతీయులందరు గర్వించదగ్గ విషయమన్నారు దిల్ రాజు. చంద్రయాన్ -3 తో సరికొత్త చరిత్ర లిఖించామని, ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావానికి ఇవి ప్రణామాలని, ఇది భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విజయమని తెలుగు చలన చిత్ర పరిశ్రమ భావిస్తుందన్నారు.
భవిష్యత్తులో మన దేశం చేపట్టబోయే అన్ని ప్రయోగాలకు ఈ విజయం ప్రేరణ ఇస్తుందని, ఈ సందర్భంగా అవిరళ కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు, సిబ్బందికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుందన్నారు.
Also Read:ప్రపంచమంతా ఇస్రో నామజపం!
- Advertisement -