తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక పండుగ ‘మహానాడు’కు ముహూర్తం ఖరారైంది. మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో (IFFCO) సెజ్ ప్రాంగణంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపేందుకు టీడీపీ అధిష్టానం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
హానాడు నిర్వహణను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మొత్తం 20 కమిటీలను ప్రకటించారు. సీనియర్ నాయకులు, యువ నాయకుల కలయికతో ఈ కమిటీలను సమన్వయం చేశారు.
సమన్వయ కమిటీ- నారా లోకేష్ (నేతృత్వంలో 10 మంది సభ్యులు)
ఆహ్వాన కమిటీ పల్లా- శ్రీనివాసరావు
తీర్మానాల కమిటీ -యనమల రామకృష్ణుడు
సభా నిర్వహణ కమిటీ -పయ్యావుల కేశవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు
వసతి కమిటీ – కింజరాపు అచ్చెన్నాయుడు
ఇటీవలే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్, ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన నేతృత్వంలోని 10 మంది సభ్యుల సమన్వయ కమిటీ, మిగిలిన అన్ని కమిటీల పనితీరును మరియు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుంది. నెల్లూరులోని కోడవలురు మండలంలో సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు వేదికను సిద్ధం చేస్తున్నారు.
Also Read:రక్తం గడ్డకట్టడం..ప్రమాదకర సంకేతాలు!
ఈసారి మహానాడులో రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు మరియు ప్రజా సంక్షేమంపై కీలక తీర్మానాలు చేయనున్నారు. సుమారు లక్షలాది మంది కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వసతి మరియు భోజన సౌకర్యాల విషయంలో అచ్చెన్నాయుడు నేతృత్వంలోని కమిటీ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది.

