ఇకపై స్కూళ్లలో తెలుగు తప్పనిసరి!

5
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి మొదలు 10వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఇకపై 1 నుంచి 10 వరకు అన్ని సిలబ్‌సల స్కూళ్లలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే. అలాగే విద్యార్థులకు తెలుగు భాషపై పరీక్షలను కూడా నిర్వహించాలని తెలిపింది. విద్యార్థులు తెలుగు భాషను అభ్యసించేలా చర్య లు తీసుకోవాలని పాఠశాలలను ఆదేశించింది.

9, 10 తరగతుల పాఠ్యాంశంగా వెన్నెల అనే తెలుగు వాచకం పుస్తకాన్ని తీసుకొచ్చింది . దీని వినియోగానికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి డా.యోగితా రాణా మంగళవారం మెమో జారీ చేశారు.

Also Read:చద్దన్నం..ఉపయోగాలు తెలుసా?

- Advertisement -