తెలుగులో కమిడియన్స్‌లో శ్రీనివాస్ రెడ్డి టాప్ కమిడియన్స్ లో ఒకడని చెప్పవచ్చు. తన కామిడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకొని కొన్ని ఏళ్లుగా విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు గత రెండేళ్ళ నుండి హీరోగా కూడా చేస్తున్నాడు. ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ తో పూర్తి హీరోగా మారాడు. ఇంకా ‘గీతాంజలి’ అనే హారర్ కామిడీ సినిమాలో నటించి మెప్పించాడు.
ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి హీరోగా మరో రొమాంటిక్ కామిడీ సినిమా ఒకటి మొదలుకాబోతుంది. ఇంతవరకు కామిడీ మాత్రమే చేసిన శ్రీనివాస్ రెడ్డి ఈ చేయబోతున్న సినిమాలో రొమాన్స్ కూడా చేయబోతున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ జె.బి. మను ఆ ఫిల్మ్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ “ నేను గత కొన్ని నెలలుగా శ్రీనివాస్ రెడ్డి తో ఈ కథ పై చర్చిస్తున్న ఇప్పటికీ ఓకే అయ్యింది. మిగతా పనులు కూడా అన్నీ అనుకున్నట్లే జరిగితే అక్టోబర్ నుండి షూటింగ్ మొదలుపెడతాము.
మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం ఇవ్వనున్నాడు. ఇంకా ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ అనేది ఒక నిర్ణయానికి రాలేదు అని చెప్పాడు. ఈ సినిమా శ్రీనివాస్ రెడ్డి లో మరో కొత్త కోణాన్ని బయటపెడుతుందిని చెబుతున్నారు. ఇంతవరకు కామిడీ పాత్రలో చూసిన మీరు మొదటసారి రొమాంటిక్ పాత్రలో చూడబోతున్నారు అది కూడా మంచి ఎమోషన్ తో ఉండబోతుందట.