తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు పరిచయం చేసిన సినిమా బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ కథానాయికుడిగా, ప్రతినాయకుడిగా రాణా నటించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. దర్శకధీరుడు చెక్కిన రెండు విభాగాలు దేశ విదేశాలలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది . ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది. తాజాగా ఈ చిత్రం చైనాలోనూ భారీ కలెక్షన్ల వర్షం కుపిస్తుంది. చైనా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు చిత్ర నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ. త్వరలో బాహుబలి ఫ్రీక్వెల్కి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఫ్రీక్వెల్ని వెండితెరపై కాకుండా ఆన్లైన్ సిరీస్‌గా తెరకెక్కిస్తామన్నారు. ఈ సిరీస్‌ను ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించనున్నామని తెలిపారు. ఈ సిరీస్‌ను కొత్త నటీనటులతో తీయనున్నామని చెప్పుకొచ్చారు. శివగామి చిన్నతనం నుంచి జరిగే సన్నివేశాలను చూపించనున్నామని… మహిష్మతి సెట్‌తో పాటు మరికొన్ని సెట్స్‌లలో ఈ సిరీస్‌ని తెరకెక్కించనున్నామని వెల్లడించారు.
65వ జాతీయ చలన చిత్రంలో భాగంగా ఉత్తమ యాక్షన్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా బాహుబలి 2 పలు అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక అహ్మదాబాద్ ఐఐఎం విద్యార్థుల మేనేజ్ మెంట్ సిలబస్‌లో బాహుబలిని ఓ అంశంగా చేర్చినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. బాహుబలి థీమ్‌తో వచ్చిన కామిక్ బుక్స్, ఏనిమేషన్ సిరీస్, మర్చెంట్ డైస్‌లకు మంచి ఆదరణ లభించింది. ఈ ఫ్రీక్వెల్ సిరీస్‌కి కూడా మంచి రెస్పాస్ వస్తుందని చిత్ర యూనిటి భావిస్తుంది. మరోవైపు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ సాహోతో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.