బిగ్ బాస్ 3 హోస్ట్ గా వెంకటేశ్..

179
venkatesh

బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిందో చెప్పనక్కర్లేదు. తెలుగులో సక్సెస్ పుల్ గా రెండు ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈషో తర్వలోనే మూడో షో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే బిగ్ బాస్ 3 లో పార్టీసిపేట్ చేయబోయే కంటెస్టెంట్ లను ఇప్పటికే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. కొద్ది మంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా దానిపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు.

ఇక బిగ్ బాస్ 1 సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ వ్యవహరించగా, బిగ్ బాస్ 2 కి నాని వ్యాఖ్యతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా ఎవరూ ఉండబోతున్నారని ఆలోచన తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. బిగ్ బాస్ 3 యాంకర్ గా చిరంజీవి, ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేశ్ పలువురి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా ఉన్న సమాచారం ప్రకారం మూడవ సీజన్ కు యాంకర్ గా వెంకటేశ్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించే వరకూ వేచి చూడాల్సిందే.