- Advertisement -
ఇప్పటివరకు ఏదైనా తెలియని నెంబర్ నుండి ఫోన్ వస్తే వారి పేరు తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ యాప్ ట్రూ కాలర్ వినియోగించేవాళ్లం. ఇకపై ట్రూ కాలర్‌తో పని ఉండదు. ఇన్కమింగ్ కాల్స్‌కు మొబైల్ స్క్రీన్లలో వ్యక్తి పేరు వచ్చేలా టెలికాం కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి.
వచ్చే ఏడాది మార్చి నెలకల్లా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు టెలికాం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మొబైల్లో సేవ్ చేయని నెంబర్ నుండి కాల్ వస్తే కేవలం నెంబర్ మాత్రమే వచ్చేది.
Also Read:పాత బ్యాంకు ఖాతాలో డబ్బు మర్చిపోయారా?
వ్యక్తి పేరు కోసం ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించేవాళ్ళం..కానీ మార్చి నుండి నెంబర్ ఎవరి గుర్తింపు కార్డుపై తీసుకుంటే వారి పేరు ఫోన్ చేసినప్పుడు వచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.
- Advertisement -

