వేగంగా పరిపాలన వికేంద్రీకరణ జరిగింది: సీఎం కేసీఆర్

103
kcr
- Advertisement -

తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వెనుకబడిపోతది అన్న నోళ్లను మూయించి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్నారని ప్రతిపకాలపై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు వేగంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

ఈసందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు పరిపాలన భవనాన్ని గొప్పగా నిర్మించుకొని ప్రారంభింప చేసుకున్నందుకు జిల్లా ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన ఎవరూ కూడా మేడ్చల్‌ జిల్లా అవుతుందని ఏనాడూ కలగనలేదన్నారు. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లే నూతన జిల్లాలను ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. పరిపాలన సౌలభ్యం ప్రజలకు ఎంత దగ్గరగా వస్తే అంత చక్కగా పనులు అంతే వేగంగా జరుగుతయన్నారు. వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు కావాలని అనాడే అనుకున్నామని చెప్పుకొచ్చారు. జిల్లాలను విభజిస్తే భవిష్యత్‌లో బాగుంటుందనే ఉదేశ్యంతో జిల్లాలను విభజించే ముందు అనేక రకాల సమస్యలను మెధోమథనం ద్వారా చర్చించి, తర్వాత విభజన అంశం మొదలుపెట్టమన్నారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాను ప్రజాప్రతినిధులు, మంత్రులు కోరడం.. జనాభాను పరిశీలించినప్పుడు చాలా పెద్ద జిల్లాగా ఉండడం, పరిపాలన సౌలభ్యం గొప్పగా ఉండాలంటే, ప్రజలకు అన్నీ మంచి పనులు నెరవేరాలంటే తప్పకుండా మేడ్చల్‌ జిల్లా కావాలని నిర్ణయం తీసుకోని ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో అన్ని జిల్లాలను విభజించామన్నారు. అందులో భాగంగానే 33 జిల్లాలు వచ్చాయన్నారు.

రైతులు తమ గోడును చెప్పుకునేందుకు వేదికలు లేకపోతే చాలా బాధేసిందన్నారు. తెలంగాణ వచ్చాక రైతుల కోసం ప్రతి 5వేల ఎకరాల వ్యవసాయ భూములకు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, ఒక్కో వ్యవసాయాధికారిని నియమించుకొన్నామన్నారు. వాటిని 2601 క్లస్టర్లుగా విస్తరించుకొని పరిపాలనకు వీలుగా ఏర్పాటు చేశామన్నారు. కానీ క్లస్టర్‌లకు అనుగుణంగా రైతు వేదికలు లేకపోవడంతో యుద్ధ ప్రతిపాదికన ఆరేడు నెలల్లో నిర్మించి రైతులకు అప్పజేప్పమన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరిగింది కాబట్టి.. అంత సులభంగా భవనాలు కట్టుకోగలిగమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 11వేల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలు ప్రజలకు చకాచకా, వేగంగా వాటి ఫలాలు అందుతున్నయన్నారు. ఇవాళ మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు.. దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు అద్భుతంగా అందుతున్నాయన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దళారీల ప్రమేయం లేకుండా కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా ఠంచన్‌గా వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చేశామని…ఇదంతా కేవలం పరిపాలన వికేంద్రీకరణ వల్లే సాద్యమైందన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే 36లక్షల పెన్షన్లు కార్డులు ఇస్తున్నామని మరో కొత్తగా 10లక్షల పెన్షన్లు ఆగస్టు 15 నుంచి పంచుతున్నమన్నారు. కొందరు ఉచితాలు అని చెప్పి వాటిని ప్రజలకు అందకుండా చేయాలనుకుంటున్నారని వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత తికమక అయిన అందరికి సంక్షేమ ఫలాలు అందించడంలో కొంత మేర ఆలస్యమైందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. ఈ 46లక్షల పెన్షన్‌ దారులకు ఆధునిక హంగులతో కూడిన, అద్భుతమైన కొత్త కార్డులు ఎలక్ట్రానిక్‌ బార్‌కోడ్లతో పంపిణీ చేస్తున్నమన్నారు. రాబోయే వారం పది రోజుల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారని, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

- Advertisement -