2.0పై టెలికాం సంస్థల గుస్సా..రిలీజ్‌ సస్పెన్సే..!

273
rajani 2.0
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్-టెక్ దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 2.0. నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా పదివేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయ్యేలా నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా విడుదలకు టెలికాం సంస్థల రూపంలో అడ్డంకివచ్చిపడింది.

చిత్ర టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌లో సెల్ ఫోన్ వాడంక‌పై ప్ర‌జ‌లలో భ‌యాందోళ‌న‌లు క‌లిగేలా స‌న్నివేశాలు ఉన్నాయ‌ని టెలికాం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మొబైల్ ఫోన్స్, సెల్ టవర్స్ వల్ల మానవాళికి ప్రమాదకరం అనే తప్పుడు మెసేజ్ ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని కేంద్ర సెన్సార్ బోర్డ్‌కి,సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు చేసింది. సెల్‌ఫోన్‌ వల్ల పర్యావరణానికి హాని జరిగినట్లు శాస్త్రీయంగా ఎక్కడా రుజువుకాలేదని టెలికాం సంస్థ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2.0 రిలీజ్‌ వాయిదా పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్, అమీజాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రాన్ని 500 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెరకెక్కించారు. ఇప్పటికే సినిమా టీజర్,ట్రైలర్‌,మేకిండ్ వీడియోలతో భారీ హైప్ క్రియేట్ కాగా ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా వాయిదా పడుతుందనే వార్త రజనీ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగిస్తోంది.

- Advertisement -