త్వరలో యూజర్లకు షాకివ్వనున్నాయి టెలికాం కంపెనీలు. రీచార్జ్ ధరల పెంపుకు రంగం సిద్ధం చేశాయి. ఒకవేళ రీఛార్జ్ ధరలు పెరిగితే వినియోగదారులపై ఖచ్చితంగా భారం పడనుంది.
2019 డిసెంబర్ నుండి 2021 నవంబర్‌తో పాటు పాటు 2024 జులైలో మూడుసార్లు టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. టెలికాం కంపెనీలు యావరేట్ రెవెన్యూ పర్ యూజర్ ను పెంచాలని యోచిస్తున్నాయి.
గత ఐదు సంవత్సరాలలో టెలికాం కంపెనీల ఆదాయం దాదాపు రెట్టింపు అయిందని ఓ నివేదిక పేర్కొంది. కంపెనీల ఆదాయం మెరుగుపడటమే కాదు ఖర్చుల స్థిరీకరణతో పాటు.. మార్జిన్స్ బలపడుతున్నాయి. 5జీ సేవలు వచ్చాక కంపెనీలు తమ క్యాపిటల్ ఎక్స్‌పెండేచర్ తగ్గించాయి. ప్రస్తుతం 25కోట్ల మంది యూజర్లు 2జీ సేవలను ఉపయోగిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా అత్యధికంగా 40శాతం వాటాను కలిగి ఉండగాఎయిర్‌టెల్‌కు 23శాతం 2జీ కస్టమర్స్ ఉన్నారు.
స్టార్‌లింక్ భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతుండగా ఇందు కోసం ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోతో ఒప్పందం కుర్చుకుంది ఎలాన్ మస్క్ కంపెనీ.
Also Read:KTR:ప్రజాపాలనలో ప్రగతి అధోగతి

