కొత్త జిల్లాల ఆవిర్భావం..అర్థరాత్రి 12:12 ని.లకు ముహుర్తం

337
- Advertisement -

కొత్త జిల్లాల ఆవిర్భావానికి రాష్ట్రం ముస్తాబవుతోంది.కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ కానుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో తెలిపిన 27 జిల్లాలకు.. మరో నాలుగు జిల్లాలను అదనంగా చేరనున్నాయి.జిల్లాల నోటిఫికేషన్ల విడుదల ముహూర్తాన్ని అర్థరాత్రి 12 గంటల 12 నిమిషాలకు నిర్ణయించారు. మొదటగా కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈ వెంటనే.. కలెక్టర్లు, ఎస్పీల నియామక జీవోలు విడుదల అవుతుంది. కొన్ని జిల్లాల పేర్లు కూడా ప్రకటిస్తారు.

తొలుత ప్రకటించిన విధంగా 27 జిల్లాలతో పాటు జనగాం, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాలతో కలిపి 31 జిల్లాలతో కూడిన నోటిఫికేషన్ వెలువడనుంది. కొత్త జిల్లాల ప్రకటనపై ఇప్పటికే సీఎం పలుమార్లు సీఎస్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఫైనల్ నోటిఫికేషన్ పక్కాగా ఉండాలని.. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. కొత్త జిల్లాలకు పేర్లను కూడా కన్ ఫామ్ చేశారు. కొత్తగా 21 జిల్లాలు.. 120కిపైగా మండలాలు.. 25కు పైగా రెవెన్యూ డివిజన్ల పరిధులను సీఎం గూగుల్ మ్యాప్స్ సహాయంతో… పరిశీలించారు.

ఇక ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఆ సమయంలో కర్కాకట లగ్నం ఉంటుందని శృంగేరీ పీఠం ఆస్థాన సిద్ధాంతి ఫణి శశాంక శర్మ తెలిపారు. కర్కాటక లగ్నంలో జిల్లాల నోటిఫికేషన్ విడుదల చేయటం వల్ల.. మంగళవారం దోషం కూడా ఉండదని సిద్ధాంతులు ప్రకటించారు. తెల్లవారుజామున రెండు గంటలకు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్ల నియామక ఫైల్ పై సీఎం సంతకాలు చేయాలని నిర్ణయించారు. దసరా రోజు.. ఉదయం పది నుంచి.. 11 గంటల మధ్యలో.. అన్ని కొత్త జిల్లాల ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. సంబంధిత కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులను ఈ రాత్రే కొత్త జిల్లాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

KCR

రేపు ఉదయం పది గంటల 12 నిమిషాలకు ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లాను ప్రారంభించనున్నారు. కొత్త కలెక్టరేట్ లో.. కొత్త కలెక్టర్ కు స్వయంగా బాధ్యతలను అప్పగించనున్నారు. జిల్లా ఆవిర్భావం, సీఎం రాక సందర్భంగా… సిద్దిపేటలో భారీ హంగామా కనిపిస్తోంది. సీఎంకు పెద్దసంఖ్యలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకనున్నారు.

రేపు దసరా సందర్భంగా పండుగలా కొత్త జిల్లాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లాల ప్రారంభానికే ప్రాధాన్యత ఇవ్వడంతో… మొదట జిల్లాలు.. ఆ తర్వాత డివిజన్లు, , మండలాల ప్రారంభ కార్యక్రమాలు జగనున్నాయి. అవసరమైన చోట మాత్రమే కొత్త ఆఫీసులు ఏర్పాటుచేయాలని.. పాత కార్యాలయాలను యాజిటీజ్ గా కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

- Advertisement -