వచ్చేసింది హరిత పండుగ

34
harithaharam
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం పచ్చగా మారాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ హరితహారం అనే మహయజ్ఞం మొదలుపెట్టారు. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రముఖులు, చిన్న పెద్ద లేకుండా అందరూ దీనిలో భాగస్వాములవుతున్నారు. తాజాగా 8వ విడత హ‌రిత‌హారం కింద 19.54 కోట్ల మొక్క‌లు నాటాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో అట‌వీ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఏ శాంతికుమారి వివిధ శాఖ‌ల అధికారుల‌తో బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. హ‌రిత‌హారం కింద ఈ ఏడాది 19.54 కోట్ల మొక్క‌లు నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు ఆమె తెలిపారు.

పంచాయ‌తీ రాజ్ శాఖ ఆధ్వ‌ర్యంలో 8.76 కోట్ల మొక్క‌లు, మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ఆధ్వ‌ర్యంలో 7.32 కోట్లు, నీటిపారుద‌ల శాఖ ఆధ్వ‌ర్యంలో 5 కోట్లు, అట‌వీ శాఖ ఆధ్వ‌ర్యంలో 1.54 కోట్ల మొక్క‌లు నాటాల‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్ర‌దేశాల్లో మొక్క‌ల‌ను విరివిగా నాటాల‌ని సూచించారు. ఇరిగేష‌న్ ప్రాజెక్టుల వ‌ద్ద‌, కాలువ‌ల వెంట కూడా మొక్క‌లు నాటేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ ఏడాది కూడా హరిత‌హారం కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని అధికారుల‌కు శాంతికుమారి సూచించారు. హ‌రిత‌హారం అమ‌లులో ఎలాంటి నిర్ల‌క్ష్యం వ‌హించిన స‌ద‌రు అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.
- Advertisement -