హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎమ్డీఏ) మీరాలం చెరువుకు కేబుల్ బ్రిడ్జిని ప్రతిపాదించడంతో, హైదరాబాద్ త్వరలోనే మరో మైలురాయిని చేరుకుంటుందని హెచ్ఎమ్డీఏ అధికారి ఒకరు తెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్‌లోని ‘సీక్రెట్ లేక్’గా పిలవబడే సుందరమైన దుర్గం చెరువు మీద ఉన్న కేబుల్ బ్రిడ్జీ మొదటిది కాగా మీరాలంపై వంతెన తెలంగాణ రాజధానిలో రెండవదన్నారు.
నగరవాసులకు మరియు పర్యాటకులకు ఐకానిక్ స్పాట్‌గా మారిన దుర్గం చెరువు వంతెనను 2020 సెప్టెంబర్‌లో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ ప్రారంభించారు. ఇప్పటికీ నగరంలో అత్యధికంగా ఫోటోలు తీసిన ప్రదేశాలలో ఇది ఒకటిగా నిలిచిందన్నారు. రద్దీగా ఉండే బెంగళూరు జాతీయ రహదారి,చింతల్మెట్ మార్గం చాలా కాలంగా ట్రాఫిక్ రద్దీతో బాధపడుతోందని… మీరాలం చెరువు వంతెన నిర్మించబడిన తర్వాత ఇది తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ వంతెన పాతబస్తీలో పర్యాటకాన్ని కూడా పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.
మీరాలం చెరువు వంతెన 2.5-కి.మీ పొడవు మరియు ఆరు లేన్లతో ఉంటుందని అధికారులు తెలిపారు. దీని సెంట్రల్ స్పాన్ 350 మీ.. మరియు పైలాన్లు 100-మీ.. ఎత్తు ఉంటుంది. డిమార్ట్-గురుద్వారా-కిషన్‌బాగ్-బహదూర్‌పురా క్రాస్‌రోడ్స్ మార్గంలో ప్రతిపాదించబడిన వంతెనతో ఈ వంతెన బెంగళూరు జాతీయ రహదారిని అత్తాపూర్ సమీపంలోని చింతల్‌మెట్‌తో కలుపుతామని తెలిపారు. ట్రాఫిక్‌ను సులభతరం చేయడం మరియు చాలా మందికి అవాంతరాలు లేని ప్రయాణానికి భరోసా ఇవ్వడంతో పాటు, వంతెన నుండి నీటి ప్రదేశం యొక్క దృశ్యం అద్భుతంగా ఉంటుందనిహెచ్ఎమ్డీఏ అధికారి ఒకరు తెలిపారు.