Revanth:డ్రగ్స్ అంటే భయపడాలి

6
- Advertisement -

డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో నేరాలను ఎదుర్కోవడంలో సైబర్ క్రైం టీమ్ సమర్ధవంతంగా పని చేస్తోందన్నారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్ అని ..డ్రగ్స్ నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేసినవారికి పదోన్నతి కల్పిస్తాం అన్నారు.చిన్నారులపై జరుగుతున్న దాష్టీకాలకు కారణం మాదకద్రవ్యాలే.. తెలంగాణ యువకులు డ్రగ్స్ కు బానిసలు కాదు.. సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలన్నారు.

డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని అభినందించారు సీఎం రేవంత్. ప్రతీ సినిమా థియేటర్‌లో సినిమా స్క్రీనింగ్‌కు ముందు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్‌కు సంబంధించి వీడియో ఉచితంగా ప్రదర్శించేలా చూడాలన్నారు. తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలని తేల్చిచెప్పారు.

Also Read:Trump:ట్రంప్‌కు రిలీఫ్

- Advertisement -