ప్రతీ పంటకు రూ.4 వేలిస్తాం..

173
farming state, KCR, Kompally, Telangana, TRS plenary
farming state, KCR, Kompally, Telangana, TRS plenary
- Advertisement -

కోటి ఎకరాలకు నీరు అందించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ప్లీనరీ హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. ముందుగా తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం కేసీఆర్‌ ప్రారంభోపన్యాసంతో ప్లీనరీ ప్రారంభమైంది. కేసీఆర్ మాట్లాడుతూ.. రైతులకు రెండు పంటలకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడి ఇస్తామన్నారు. రూ.4 వేలతో సాగుకు అవసరమైన ఏదైనా రైతు కొనుక్కోవచ్చన్నారు.

రాష్ట్రంలో 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 24 శాతం ఉన్నారన్నారు. 10 ఎకరాల్లోపు ఉన్న రైతులు 11 శాతం, 25 ఎకరాల్లోపు ఉన్న రైతులు 3 శాతం, 25 ఎకరాల పైబడి ఉన్న రైతులు 0.28 శాతం ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికే కృష్ణా, గోదావరి నీళ్లు తీసుకొస్తమని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయను ప్రపంచమంతా కొనియాడుతున్నదన్నారు. కోటి ఎకరాలకు నీరు అందించడమే తమ లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ పటిష్టం కావాలన్నారు. గత పాలకులు కుల వృత్తులను నిర్వీర్యం చేశారు. యాదవుల కోసం రూ.5వేల కోట్లతో 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. నాయి బ్రహ్మణుకు 25000 వేల మోడ్రన్ సెలూన్లకు లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వమే అందచేయనుందని తెలిపారు. రజకసోదరులకు అవసరమయ్యే వాషింగ్ మెషిన్లు, డ్రయ్యర్లు, నవీన దోబీఘాట్లు వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందన్నారు.

2001లో గులాబీ జెండా ఎగిరి, జై తెలంగాణ నినాదం మళ్లీ ప్రారంభమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు కృతజ్ఙతలు తెలియజేశారు. కొద్దిమందితో ప్రారంభమైన టీఆర్‌ఎస్ ప్రస్థానం 75లక్షల సభ్యత్వానికి చేరిందన్నారు. బతుకు భద్రత కోసమే సంక్షేమ కార్యక్రమాలని సీఎం స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు రూ.40వేల కోట్లు కేటాయించామన్నారు. ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళలకు జీవన భృతి ఇస్తున్నామని తెలిపారు. వసతి గృహాల్లో సన్న బియ్యం ప్రవేశపెట్టామన్నారు. .

విద్యుత్ ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలియదు.. సచివాలయం అంతా దళారీల గుంపులు… సిరిసిల్లలో చేనేతల ఆత్మహత్యలు, జిల్లా కలెక్టర్లు అక్కడ గోడలపై ఆత్మహత్యలు పరిష్కారం కాదు అని రాయించే పరిస్థితి. విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే విద్యుత్ ఉండదని చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? కరెంటు కోతలు లేని తెలంగాణ, సంక్షేమ తెలంగాణ, ఆసరా పింఛన్లతో ప్రారంభమై అన్ని విధాలుగా పురోభివృద్ధి బాటలో నడుస్తున్నామని కేసీఆర్ అన్నారు.

- Advertisement -