తెలంగాణ వెదర్ అప్‌డేట్..

201
weather-summer
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచనను తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ప్రధానంగా తక్కువ ఎత్తులో ఉత్తర దిశ నుండి గాలులు తెలంగాణా రాష్ట్రంలోకి వీస్తున్నవి…ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ నెల 3,4 తేదీలలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి రెండు ప్రదేశాలలో సాధారణం కన్నా 2 నుండి 3 డిగ్రీలు సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది.

జిల్లాలో ఒకటి రెండు ప్రదేశాలలో వడ గాలులు వీచే అవకాశములు ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూల్‌లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది.

- Advertisement -