KTR:రైతుబంధు ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్..

22
- Advertisement -

దేశంలో రైతుబంధు ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి కేటీఆర్. వనపర్తి జిల్లా సంకిరెడ్డి పల్లి వద్ద ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజతో శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు కేటీఆర్. రైతు భీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నది కేసీఆర్ అన్నారు. పాలమూరు అంటే నాడు మైగ్రేషన్ నేడు ఇరిగేషన్…పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.

భవిష్యత్ లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారని…దూరదృష్టితో కేసీఆర్ ప్రత్యామ్నాయం పంటలను ప్రోత్సహిస్తున్నారన్నారు. సాంప్రదాయ పంటలతో రైతులు వ్యవసాయానికి దూరమయ్యే అవకాశం ఉందని గుర్తించి పంటల మార్పిడితో వ్యవసాయం బలోపేతం చేస్తున్నారన్నారు. ఒకనాడు చెరువు కింద చేను ఉంది అని చెప్పేది .. ఇప్పుడు చేను కిందకు చెరువు వచ్చింది అని తాడూరు మండలం ఐతోలు రైతు, ఎస్వీఎస్ యజమాని కృష్ణారెడ్డి చెప్పారన్నారు. నాడు మనకు అందకుండా కిందకుపోయిన కృష్ణానీళ్లను బొట్టు బొట్టు ఒడిసిపట్టి రైతుల పొలాలకు మళ్లిస్తున్నాం అన్నారు.

వ్యవసాయ మంత్రి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధితో పాటు వ్యవసాయం బలోపేతమవుతుందని…తెలంగాణ ఏర్పాటుకు ముంది వరి ధాన్యం ఉత్పత్తి కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నులే .. నేడు దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడం గమనార్హం అన్నారు. ఇదే విషయం వరి ధాన్యం కొనమని చెప్పిన కేంద్ర మంత్రికి చెబితే అది ఎలా సాధ్యం అని అపహాస్యం చేశారని…మేమే ఖర్చు భరిస్తాం ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పాం అన్నారు.

Also Read:KTR:రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడి

వరి మాత్రమే సాగు చేయడం భావ్యం కాదని…దేశంలో అవసరమైన 70 శాతం వంటనూనెలు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం అన్నారు. వరి ఉత్పత్తిలో దేశానికి దారి చూపినట్లే వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు తెలంగాణ దారి చూపాలని కేసీఆర్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారన్నారు. అయిదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అని…
వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్వయంగా అయిల్ పామ్ సాగు చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. సాగులో కష్టనష్టాలు తెలుసుకుని ప్రభుత్వానికి చెప్పేందుకు వారు ముందుగా సాగుచేయడం అభినందనీయం అన్నారు. 14 కంపెనీలతో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం .. అందుబాటులో ఫ్యాక్టరీలు నిర్మించి రైతులకు ప్రోత్సాహమిస్తాం అన్నారు. నాలుగేళ్లలో ఆయిల్ పామ్ పంట చేతికి వచ్చే వరకు అంతరపంటలు సాగు చేసుకోవచ్చని…ఏడాదికి లక్ష పై చిలుకు ఆదాయం ఆయిల్ పామ్ సాగుతో సాధ్యం అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మళ్లీ గెలుస్తారని…ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల్లో స్థానికులకే ఉపాధి .. అవసరమైతే యువతకు ప్రభుత్వం నుండి నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు.

Also Read:మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ లేనట్లేనా?

- Advertisement -