ప్రభుత్వ సంకల్ప బలానికి ప్రతీక : సీఎం కేసీఆర్‌

57
kcr
- Advertisement -

హైద‌రాబాద్ న‌డిబొడ్డున పోలీస్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నెల‌కొల్ప‌డం ప్ర‌భుత్వ సంక‌ల్ప బ‌లానికి ప్ర‌తీక అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బంజారాహిల్స్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్య‌వ‌స్థ రావాల‌ని చెప్తూ వ‌చ్చాను. అది నెర‌వేరింది. మ‌రో చిన్న కోరిక ఉంది. సంస్కార‌వంత‌మైన పోలీసు వ్య‌వ‌స్థ నిర్మాణం కావాలి. దేశానికే ఆద‌ర్శంగా నిల‌వాలి. ఎంత చ‌దువుకున్నా సంస్కారం లేక‌పోతే అది ఫలవంతం కాని విద్యాగా చేప్పవచ్చు కాబటి పోలీసులకు సంస్కారం కొరవడితే అది క‌ష్టమన్నారు.

పోలీస్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ మనందరికీ గర్వకారణమన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో సీసీసీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీసీ అన్ని  రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమాచార సమన్వయానికి  మూలస్థంభంగా నిలుస్తుందన్నారు. ప్రకృతి విపత్తులను ప్రమాదాలను నేరాలను గుర్తించడం, వాటిని ఎదుర్కునేందుకు అధికారులకు సమాచారాన్నిఅందించే అత్యున్నత సామర్థ్యం కలిగి ఉన్నదన్నారు. పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఉత్తమమైన పని ఎక్కడ చేసినా ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుందని ఈ సందర్భంగా అన్నారు. మనలో కొందరు 50 శాతమే వర్తమానంలో ఉండి పని చేస్తుంటారు. దాంతో ఫలితాలు సరిగా రావు… అనుకున్న పని సరిగా జరగదు. అందుకే ఏపనైనా సరే కష్టపడి పనిచేస్తే అద్భుత ఫలితాలొస్తాయన్నదానికి ఇది నిలువెత్తు నిదర్శనమన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్య‌వ‌స్థ రావాల‌ని చెప్తూ వ‌చ్చాను. అది నెర‌వేరింది. దేశానికే ఆద‌ర్శంగా నిలిచే పోలీస్ వ్యవస్థ కోసం.. సంస్కార‌వంత‌మైన పోలీసు వ్య‌వ‌స్థ నిర్మాణం కోసం సీసీసీ ఉపయోగపడుతుంది.

రాష్ట్రంలో గుడుంబా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్మూలించడంలో పోలీస్ శాఖ పనితనం గొప్పది.  రాబోయే రోజుల్లో పోలీసులు మ‌రింత చురుకుగా ప‌ని చేయాలని కొరుకుంటున్నాను. మంచిని సాధించ‌డానికి సంక‌ల్పంతో ప‌ని చేస్తే స‌త్ఫ‌లితాలు వ‌స్తాయి. చిత్తశుద్ది వాక్శుద్ది, సందర్భశుద్ది వుంటే సాధించలేనిదేమీలేదు. గ‌తంలో ప‌నిచేసిన పోలీసు క‌మిష‌న‌ర్లు గొప్ప సేవ‌లందించారు. వారిని పిలిచి వారి అనుభవాలను సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. మానవ సమాజం ఉన్నంత వరకు శాంతి భధ్రతల పరిరక్షణ అందుకోసం పోలీస్ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. సమాజానికి సైబర్ నేరాలు, డ్రగ్స్ ప్రమాదకరంగా పరిణమించాయి. వాటిని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదే… మీ అందరి సహకారంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు వెల్లివిరుస్తున్నాయి. న్యూయార్క్ లాగే మన దగ్గర కూడా నేరాలు పూర్తిగా తగ్గాలన్నారు. తెలంగాణ పోలీసు శాఖ కూడా అద్భుత ఫ‌లితాలు సాధించాలి. ప్ర‌జ‌ల‌కు సేవ అందించే సంస్థలాగా మరింత అభివృద్ధి కావాలి. అందరూ సంస్కార‌వంత‌మైన పోలీసులుగా త‌యారు కావాలి. ఏ సమస్య ఎదురైనా సమిష్టి ఆలోచనలతో పోలీసులు పరిష్కరించాలని సూచించారు.

- Advertisement -