రాష్ట్రంలో ఉన్న 20,555 మంది ఇటీవలె ప్రభుత్వం క్రమబద్దీకరించిన సంగతి తెలిసిందే. వీఆర్ఏల విద్యార్హత ఆధారంగా ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వేతనాలను వారికి వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నేపథ్యంలో పూర్తి బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ మార్గదర్శకాలు జారీ చేశారు.
వీఆర్ఏల వయస్సు 61ఏళ్లు పైబడిఉంటే వారి వారసులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మొత్తం వీఆర్‌ఏలలో 16,758 మంది 61ఏళ్లలోపు వారు ఉండగా ఆపై వయస్సున్న వారు 3,797 మంది ఉన్నారు. వీఆర్ఏల వయస్సు నిర్ధారణకు తుది గడువును 1జూలై 2023 గా నిర్ణయించారు.
Also Read:వైభవంగా శ్రావణ పౌర్ణమి పౌర్ణమి గరుడ సేవ
వారసుల్లో ఎవరికి ఉద్యోగం ఇవ్వాలనే దానిపై దరఖాస్తులతో పాటు అఫిడవిట్, కుటుంబ సభ్యుల నుంచి నిరభ్యంతర పత్రం తప్పనిసరిగా స్వీకరించాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియ మొత్తం ఈనెల ఐదో తేదీలోపు పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు నవీన్ మిట్టల్.
ఒకవేళ ఇతర జిల్లాలకు కేటాయిస్తే ఆ జాబితాను విడుదల చేయాలని తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆ జిల్లా కలెక్టర్‌కి రిపోర్ట్ చేయొచ్చు. ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే ఎలాంటి సిఫారసులు చెల్లవు.
Also Read:సస్పెన్స్ థ్రిల్లర్..’ప్రియమైన ప్రియ’