ఓటర్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి !

49
- Advertisement -

తెలంగాణలో అధికారాన్ని మరోసారి ఎంచుకునే సమయం రానే వచ్చింది. మరో ఐదేండ్లు భవితకు నాంది పలికే నాయకత్వాన్ని ఎన్నుకునే సమయం వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి అన్నీ రంగాల్లో ముందుకు నడిపిస్తూ తన పాలన దక్షతతో దేశంలోనే తెలంగాణను నెంబర్ ఒన్ గా నిలిపిన బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ ఒకవైపు.. స్కామ్ లతో కొట్టుమిట్టాడుతూ అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పార్టీలు మరోవైపు ఉండడంతో ఓటర్లు సరైన నాయకత్వానికే పట్టం కట్టాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంచితే.. ఓట్ల సమయంలో ప్రజలు గందరగోళానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు కల్గిన వారికి ఈవీఎం మిషన్లపై ఎలాంటి అవగాహన ఉండదు. కాబట్టి కొత్తగా ఓటు హక్కు కలిగిన వారు కొన్ని జాగ్రత్తలు సూచనలు తప్పకుండా పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.

ఓటర్లు తమ పోలింగ్ బూత్ లను కనుక్కోవడానికి ఎన్నికల కమిషన్ electoralsearch.in అనే వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్ ద్వారా ఓటర్లు వారి యొక్క పోలింగ్ బూత్ ను కనుగొనవచ్చు. ఇంకా ఓటు వేయడంపై ఎలాంటి సందేహాలు ఉన్న 1950 నెంబర్ కు కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

ఇక పోలింగ్ స్టేషన్ కు వెళ్లేముందు ఓటర్ల యొక్క గుర్తింపు కార్డు అనగా పాన్ కార్డు, లేదా ఆధార్, ఓటర్ ఐడి, వంటి గుర్తింపు కార్డులను తీసుకెళ్లాలి. అలాగే ఓటర్ స్లీప్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఒకవేళ ఓటర్ స్లీప్ లేనట్లైతే పోలింగ్ బూత్ వద్ద ఉన్న అధికారులను సంప్రదించి ఓటర్ స్లీప్ తీసుకోవచ్చు. ఓటు వేసేందుకు బూత్ లోకి వెళ్ళిన తరువాత పేరు, గుర్తింపు కార్డు వంటివి పరిశీలించిన తరువాత సంబంధిత అధికారులు వేలికి ఇంకును అంటిస్తారు. ఆ తరువాత ఈవీఎం మిషన్ వద్దకు వెళ్ళాలి.

ఈవీఎం మిషన్ పై మీరు ఎన్నుకోవాల్సిన అభ్యర్థి పేరు ఆయనకు సంబంధించిన పార్టీ గుర్తులు కనిపిస్తాయి. అక్కడ ఎలాంటి కంగారు లేకుండా ఎన్నుకోవాల్సిన అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న బ్లూ బటన్ పై నోక్కాలి. అప్పుడు దాని పక్కనే రెడ్ సిగ్నల్ రావడంతో పాటు బీప్ సౌండ్ కూడా వస్తుంది. అప్పుడు మీ ఓటు నమోదు అయినట్లు గుర్తించాలి. మీరు ఎవరికి ఓటు వేశారనేది ఏడు సెకండ్ల పాటు ఇవీఎం స్క్రీన్ పై కనిపిస్తుంది. అప్పుడు మీరు ఎవరికి ఓటు వేశారో మరోసారి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓటు వేసే క్రమంలో ఈవీఎం మిషన్ బీప్ సౌండ్ రాకపోయినా, ఇతరత్రా సమస్యలు తలెత్తిన వెంటనే అక్కడే ఉన్న అధికారులను సంప్రదించాలి.

Also Read:Revanth:గెలిస్తే డీల్.. టీడీపీతో రేవంత్ రెడ్డి!

- Advertisement -