వాహనాల రిజిస్ట్రేషన్ విభాగంలో మార్పులు

4
- Advertisement -
జనవరి 24,2026 నుండి రవాణా శాఖ లో డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ విధానం అమలు చేయబడింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి నాన్-ట్రాన్స్‌పోర్ట్ మోటార్ సైకిళ్లు మరియు మోటార్ కార్లు మొదటి రిజిస్ట్రేషన్ సమయంలో RTA కార్యాలయాలకు వాహనాన్ని చూపించే అవసరాన్ని తొలగిస్తూ ముందుగా ఉత్తర్వులు జారీ చేయబడిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు డీలర్లు Form-20 (ఫైనాన్సియర్ సంతకంతో, అవసరమైతే) మరియు ఇతర పేపర్ ఆధారిత పత్రాలను స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సంబంధిత RTA కార్యాలయాలకు పంపిస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్లు గమనించబడింది.
ఈ నేపథ్యంలో క్రింది మార్పులను అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ ఆదేశాలు 13-03-2026 నుండి అమల్లోకి వస్తాయి.
ముఖ్య నిర్ణయాలు
1.13-03-2026 నుండి, డీలర్లు RTA కార్యాలయాలకు Form-20 మరియు ఇతర పేపర్ పత్రాలను Physical గా సమర్పించే విధానాన్ని పూర్తిగా రద్దు చేయబడింది.
2.ఇకపై డీలర్లు వాహన యజమాని మరియు ఫైనాన్సియర్ (అవసరమైతే) సంతకాలతో కూడిన Form-20 మరియు ఇతర పత్రాల స్కాన్ కాపీలను మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలి.
3.13-03-2026 తర్వాత జారీ అయ్యే Temporary Registration (TR) ఉన్న వాహనాలకు Physical పత్రాలు RTA కార్యాలయాలు స్వీకరించవు.
4.13-03-2026 కు ముందు TR పొందిన వాహనాలకు కూడా, డీలర్లు Form-20 మరియు ఇతర పత్రాల స్కాన్ కాపీలు అప్లోడ్ చేసి ఆన్‌లైన్ ద్వారా శాశ్వత రిజిస్ట్రేషన్ పొందే అవకాశం కల్పించబడింది.
5.డీలర్లు అప్లోడ్ చేసే పత్రాల కు పూర్తి బాధ్యత వారిదే. తప్పుడు లేదా నకిలీ పత్రాలు సమర్పించినట్లయితే క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి.
6.RTA కార్యాలయాల్లో అందిన ఆన్‌లైన్ దరఖాస్తులను రెండు పని దినాల్లోపే పరిశీలించి ఆమోదం లేదా రివ్యూ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయబడినాయి. ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తీసుకోబడతాయి.
7.డీలర్లు తమ వద్ద 7 రోజులకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకూడదు. ఉల్లంఘన జరిగినట్లయితే వారి లాగిన్ నిలిపివేయబడుతుంది మరియు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.
అన్ని అధీకృత ఆటోమొబైల్ డీలర్లు పై మార్పులను గమనించి, వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం Form-20 మరియు ఇతర పత్రాలను కేవలం ఆన్‌లైన్ విధానంలోనే సమర్పించాలి.
- Advertisement -