- Advertisement -
తూర్పు ఉత్తర ప్రదేశ్ నుండి దక్షిణ ఒరిస్సా వరకు చత్తీస్ గఢ్ మీదుగా 4.5 km ఎత్తు వద్ద ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడిందని ఫలితంగా మరో రెండు రోజులు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ.
అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని…ఈరోజు ఆదిలాబాద్, కోమురంభీం –ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.
- Advertisement -