గ్లోబల్ సీడ్ హబ్ గా తెలంగాణ

350
sk joshi
- Advertisement -

తెలంగాణ గ్లోబల్ సీడ్‌ హబ్‌గా మారనుందని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కె జోషి అన్నారు.హైదరాబాద్ లో జూన్ 26 నుంచి జూలై 3 వరకు జరగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సు ఏర్పాట్లపై ఆర్గనైజింగ్ కమిటి సభ్యులతో సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు హైదరాబాద్ కు రానున్నడం దృష్ట్యా సెక్యూరిటీ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ విత్తన పరిశ్రమను అభివృద్ధి చెందడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని, సదస్సులో ఇండియా, తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని తెలిపారు.ఎఫ్‌ఏవో సహకారంతో సదస్సుకు ముందు జూన్ 24, 25 తేదిలలో ఆఫ్రికా దేశాల విత్తన ప్రతినిదులతో విత్తనోత్పత్తిపై ప్రత్యేక వర్క షాప్ ఉంటుందని, ఈ వర్క్ షాప్ కు తెలంగాణ విత్తన పరిశ్రమ నుంచి కూడా విత్తన ప్రతినిధులు పాల్గొననున్నారని, విత్తన ఎగుమతులు, దిగుమతులకు మంచి వేదిక కానున్నదని అంతర్జాతీయ విత్తన సదస్సు నోడల్ ఆఫిసర్ డా. కేశవులు తెలిపారు.

జూన్ 27 న విత్తన రైతుల ప్రత్యేక సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విత్తనోత్పత్తి, విత్తన నాణ్యతపై రైతులకు మంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని తెలంగాణ నుంచి 1500 విత్తన రైతులు గుజరాత్ కర్ణాటక విత్తన రైతులు ఈ సమావేశానికి పాల్గొంటారని కమిషనర్ రాహుల్ బొజ్జా తెలిపారు.

అంతర్జాతీయ విత్తన సదస్సు ముఖ్యాంశాలు

()వేదిక.- HICC, నోవాటెల్, హైదరాబాద్
()9 రోజుల పాటు మారుతున్న ప్రపంచంలో విత్తన నాణ్యత ఎలా ఉంది అనే అంశంపై చర్చలు
()తెలంగాణ నుంచి మరిన్ని విత్తన ఎగుమతులకు ప్రోత్సాహకం
()జూన్ 26 నుంచి 28 కి విత్తన ఎగ్జిబిషన్

()జూన్ 27 న తెలంగాణ విత్తన రైతుల ప్రత్యేక సమావేశం.
()70 దేశాల నుంచి 800 విత్తన ప్రముఖుల రాక
()ఆఫ్రికా ఖండంపు దేశాల ప్రతినిధులతో తెలంగాణ విత్తన పరిశ్రమ వారితో ప్రత్యేక సమావేశం
()94 సంవత్సరాల ISTA చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆసియా ఖండంలో హైదరాబాద్ లో నిర్వహణ

()ప్రత్యేక దృష్టి సాధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
()చిన్న, మధ్య తరహా విత్తన పరిశ్రమల అభివృద్ధికి మరింత ప్రోత్సాహకం
()సదస్సుకు నోడల్ ఆఫిసర్ గా విత్తన దృవీకరణ సంస్ధ డైరెక్టర్, డా.కేశవులు నియామకం

- Advertisement -