ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీని మంత్రి హరీష్ రావుతో కలిసి ఆవిష్కరించారు శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు,నియామకాల కోసమేనని చెప్పారు. మిగతా దేశాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి..సీఎం కేసీఆర్ ప్రైవేట్ ఉద్యోగుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు.
మంత్రి కేటీఆర్ ఐటి శాఖలో లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేశారని..24 గంటల విద్యుత్ ఇవ్వడంతో పరిశ్రమలలో అనేక మంది ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు.గతంలో విద్యుత్ లేకుండా పరిశ్రమలు మూతపడేవి కానీ ఇప్పుడు హైదరాబాద్ లో పరిశ్రమల కోసం క్యూ కడుతున్నాయని చెప్పారు. కరెంట్ ఉంది ,నీళ్లు ఉన్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ప్రతి పక్ష పార్టీ లకు కనిపిస్తాలేవన్నారు.
దేశంలోనే రాష్ట్రం అనేక కార్యక్రమాలకు ఆదర్శంగా నిలుస్తోంది…పెన్షన్ వస్తుంది, కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ వస్తుందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో ప్రావీణ్యం పొందాలి….గురుకుల స్కూల్స్ లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అన్నారు. నైపుణ్యం పెంచుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి..రానున్న రోజుల్లో ధనిక రాష్ట్రంగా ముందుకు పోతుందన్నారు. మీ సమస్యల పరిస్కరం కోసం పని చేస్తాం అన్నారు.