అగ్రవర్ణ పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు,అందుకు సహకరించిన మంత్రి హరీష్ రావులకు పలు సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈరోజు సిద్దిపేటలో రెడ్డి జేఏసీ, ఆర్యవైశ్య మహాసభ,బ్రాహ్మణ పరిషత్,శ్రీవైష్ణ సంఘం, ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ జిందాబాద్, హరీష్ రావు జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పెద్దఎత్తున టపాకాయలు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు స్థానిక నాయకులు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని.. ఇది చారిత్రాత్మక నిర్ణయం..ఇందుకోసం ఎన్నో ఏండ్ల నుండి ఎదురుచూస్తున్నామన్నారు.ఈ నిర్ణయంతో అగ్రవర్ణాల్లోని పేదలకు విద్యా, ఉపాధి,ఉద్యోగ రంగాల్లో ఎంతో న్యాయం జరుగుతుందని.. సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని జేఏసీ నాయకులు కొనియాడారు.