ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం…..

266
- Advertisement -

రాష్ట్రానికి కొత్తగా 19 జాతీయ రహదారులు మంజూరైనట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఈరోజు అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీ లో జాతీయ రహదారులపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు.

జాతీయ రహదారుల విషయంలో ఉమ్మడిరాష్ట్రంలో బాధపడ్డాం. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కేసీఆర్‌ అన్నారు. జాతీయ రహదారులు తెలంగాణలో తక్కువగా ఉండటం, ఆంధ్రాలో ఎక్కువగా ఉండటం చూశాం. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జాతీయ రహదారుల సంఖ్య పెరిగింది. నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రాన్ని అంగీకరింపజేయడంలో, నిధులు సమకూర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని తెలిపారు. ఈ విజయం బంగారు తెలంగాణ సాధనలో ఒక మేలి మలుపు అని అన్నారు.

Telangana to have national highways of 5,303 km

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ జాతీయ రహదార్లు కేవలం 2,527 కిలోమీటర్లు మాత్రమేని చెప్పారు. ఆనాడు దేశంలో జాతీయ రహదారుల సగటు 2.80 కి.మీ. ఉండేదన్నారు. ఆంధ్రా సగటు 3.15 కి.మీ. అయితే తెలంగాణ సగటు 2.20 కి.మీ. అని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చి తీరాలని కేంద్రాన్ని అనేక పర్యయాలు కలిసి జాతీయ రహదారులను విస్తరించాలని కోరామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు 2,776 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారులను మంజూరు చేసింది.

గత ఏడు దశాబ్దాలలో తెలంగాణలో నిర్మించిన జాతీయ రహదారి 2,527 కిలోమీటర్లు అయితే తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలో 2776 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సాధించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు 70 ఏళ్లలో సాధించని హైవేల కన్నా తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలో 19 జాతీయ రహదారులను సాధించిందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 5,303 కి.మీ.కు పెరగనుందని తెలిపారు. ఈ రోజు దేశంలో జాతీయ రహదారుల సగటు 3.81 కి.మీ. ఉందన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల సగటు 4.62 కి.మీ. అంటే.. జాతీయ సగటును మించిపోయింది. దక్షిణ భారతదేశంలో నిన్నటి దాకా అట్టడుగున నిలిచిన రాష్ట్రం నేడు అగ్ర భాగాన నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు.

Telangana to have national highways of 5,303 km

జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,690 కోట్ల విలువైన ప్రాజెక్టులను మంజూరు చేసిందన్నారు. మరోవైపు రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి రూ. 1020 కోట్లు మంజూరు అయ్యాయి. ఎన్‌హెచ్‌ఐఏ పరిధిలో చేపట్టే మరో ఐదు హైవేలను ఫోర్ లేన్లుగా నిర్మించడానికి రూ. 8 వేల కోట్లను ఇస్తామని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారని గుర్తు చేశారు.

సంగారెడ్డి – నాందేడ్ రోడ్డుకు రూ. 2,500 కోట్లు, సూర్యాపేట – ఖమ్మం రోడ్డుకు రూ. 1,000 కోట్లు, జగిత్యాల – కరీంనగర్ – వరంగల్ రోడ్డుకు రూ. 2,300 కోట్లు, మంచిర్యాల – చెన్నపూర్ రోడ్డుకు రూ. 1500 కోట్లు, కోదాడ – ఖమ్మం రోడ్డుకు రూ. 700 కోట్లు, ఇవే కాకుండా మారుమూల అటవీ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 1590 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపామని తెలిపారు.

Telangana to have national highways of 5,303 km

నూతన జాతీయ రహదారులు వివరాలు….
1. హైదరాబాద్ – మెదక్ – రుద్రూరు – బాసర – భైంసా -248 కి.మీ.
2. నిజాంపేట – నారాయణఖేడ్ – బీదర్ – 60 కి.మీ.
3. మద్దనూరు – బోధన్ – నిజామాబాద్ – 76 కి.మీ.
4. హైదరాబాద్ – మెయినాబాద్ – చేవేళ్ల – మన్నెగూడ – కొడంగల్ – కర్ణాటక సరిహద్దు -135 కి.మీ.
5. కోదాడ – మిర్యాలగూడ – దేవరకొండ – 211 కి.మీ.

6. సంగారెడ్డి – నర్సాపూర్ – తుప్రాన్ – గజ్వేల్ – జగదేవ్‌పూర్ – భువనగిరి – చౌటుప్పల్ – 152 కి.మీ.
7. చౌటుప్పల్ – ఇబ్రహీంపట్నం – ఆమన్‌గల్ – షాద్‌నగర్ – చేవేళ్ల – శంకర్‌పల్లి – కంది – 186 కి.మీ.
8. మెదక్ – సిద్ధిపేట – ఎల్కతుర్తి – 133 కి.మీ.
9. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ – ఘట్‌కేసర్ – ఏదులాబాద్ – వలిగొండ – తొర్రూరు -నెల్లికుదురు – మహబూబాబాద్ – ఇల్లందు – కొత్తగూడెం -234 కి.మీ.
10. వరంగల్ – ఖమ్మం – 120 కి.మీ.

11. కరీంనగర్ – సిరిసిల్ల – కామారెడ్డి – ఎల్లారెడ్డి – పిట్లం – 165 కి.మీ.
12. సిరిసిల్ల – సిద్ధిపేట – జనగామ – అర్వపల్లి – సూర్యాపేట – 184 కి.మీ.
13. మంచిర్యాల – చంద్రాపూర్ వయా ఆసిఫాబాద్ – రెబ్బెన – మహారాష్ట్ర బోర్డర్ వరకు – 90 కి.మీ.
14. నిర్మల్ – మామడ – ఖానాపురం – మల్లాపూర్ – రాయికల్ – 90 కి.మీ.
15. సూర్యాపేట – ఖమ్మం – అశ్వరావుపేట – రాజమండ్రి – 175 కి.మీ.

16. సారపాక – ఏటూరునాగారం – కాళేశ్వరం – చెన్నూరు – కౌటాల – సిర్పూర్ – 396 కి.మీ.
17. మిర్యాలగూడ – పిడుగురాళ్ల – నరసరావుపేట – ఏపీ వరకు 26 కి.మీ.
18. భద్రాచలం – జిలుగుమిళ్లి – జంగారెడ్డిగూడెం – దేవరపల్లి -68 కి.మీ.
19. జహీరాబాద్ – బీదర్ – డెక్లూరు వరకు 25 కి.మీ.

- Advertisement -