తెలంగాణ తల్లి ప్లై ఓవర్‌..

9
- Advertisement -

తెలుగు తల్లి ప్లై ఓవర్ బ్రిడ్జిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణ తల్లి ప్లై ఓవర్ గా నామకరణం చేశారు. 1996 లో సమైఖ్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాయంలో ప్లై ఓవర్ నిర్మాణం కోసం శంఖుస్దాపన చేశారు.

అప్పుడు దీనికి సచివాలయం ప్లై ఓవర్ గా పేరు పెట్టారు..అప్పటి పురపాలక శాఖ మంత్రిగా తమ్మినేని సీతారాం,కార్మిక శాఖ ,ఇన్జార్జి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు గా బండారు దత్తాత్రేయ, ఖైరతాబాదు ఎమ్మెల్యేగా పి.జనార్దన్ రెడ్డి లు ఉన్నారు.

2005 జనవరిలో ముఖ్య మంత్రిగా వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగిన సమయంలో ప్రారంభించారు. ఆ తరువాత దానికి తెలుగుతల్లి ప్లైఓవర్ గా పేరు పెట్టారు…తాజాగా 2025 సంవత్సరం సెప్టెంబరు లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ప్లై ఓవర్ గా నామకరణం చేశారు….ఈ మేరకు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు.

Also Read:TTD:అక్టోబర్ విశేష ప‌ర్వ‌దినాలు

- Advertisement -