ప్రతి సంవత్సరం..‘తెలంగాణ తల్లి’ ఉత్సవాలు

4
- Advertisement -

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటినుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకులకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని పిలవాలనుకుంటున్నామని చెప్పారు.

సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

తెలంగాణ తల్లి భావన పూర్వం నుంచి ఉన్నదే అయినా దీన్ని ఉద్యమ ప్రతీకగా నాయకులు ముందుకు తీసుకువచ్చారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత బీఎస్​ రాములు మొదటిసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. దేవులపల్లి అజయ్​ సారథ్యంలో వెలువడుతున్న ప్రజాతంత్ర అనే తెలంగాణ వారపత్రిక కవర్​ పేజీపై మొదటిసారిగా ప్రచురితమైంది. అనంతరం కేసీఆర్ సర్కార్ తెలంగాణ తల్లికి మార్పులు చేసి తెలంగాణ తల్లి ప్రతిమను ప్రజల ముందుకు తీసుకువచ్చారు.

Also Read:వయనాడ్‌కు రాహుల్ బైబై!

- Advertisement -