టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ నాయకులు..

97
trs

ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు.మిగిలిన వారందరూ కూడా టీఆర్ఎస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ బీసీ సెల్ నాయకుడు రవీందర్ గౌడ్‌ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పారు.

గత ఎన్నికల్లో ఎంతో నమ్మకంతో గెలిపించినట్లుగానే ఈసారి కూడా ఈ కార్పొరేటర్ గీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లోకి రావడం చాలా సంతోషకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అంతకుముందు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ గెలుపు కోసం డివిజన్ ముఖ్య నాయకులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఐక్యంగా పని చేసి, భారీ మెజారిటీతో గెలిచే విధంగా దిశానిర్దేశం చేశారు.