రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలంగాణ శకటం ఎంపిక..

676
telangana
- Advertisement -

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా జనవరి 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో భారీ పరేడ్ నిర్వహిస్తారు. ఇందులో సైనిక సంపత్తిని ప్రదర్శించడంతో పాటు సాయుధ దళాలు కవాతు నిర్వహిస్తాయి. ఈ పరేడ్‌లో భాగంగా వివిధ రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలను, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు చేపట్టిన కార్యక్రమాలను, శకటాలను ప్రదర్శిస్తారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల నమూనాలను పరిశీలించి కేంద్ర రక్షణశాఖ ఎంపిక చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన శకటం రెండోసారి ఎంపికైంది.

Telangana

ఈ సందర్భంగా ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ మాట్లాడుతూ..2020 రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలంగాణా శకటం ఎంపిక చేశారు. దీనికి సంబంధించి రక్షణ శాఖ లిఖితపూర్వకంగా దృవీకరించిందన్నారు.. అలాగే శకటం కార్యరూపం దాల్చడానికి సూచనలు చేసింది.. మొత్తం ఎంపిక ప్రక్రియలో మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంతో ముందుకు సాగిందని గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మంత్రి కేటీఆర్, ఐ అండ్‌ పిఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Telangana

- Advertisement -